Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ శృంగార తారకు ప్యారిస్ కోర్టు షాక్!

  • అపార్ట్ మెంట్ కు రెంట్ చెల్లించని మల్లిక
  • కోర్టుకెక్కిన ఇంటి ఓనర్
  • ఇల్లు ఖాళీ చేయాలంటూ కోర్టు ఆదేశం
బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్ ను అపార్ట్ మెంట్ వదిలేసి వెళ్లిపోవాలంటూ ప్యారిస్ కోర్టు ఆదేశించింది. ఇంటి యజమానికి రెంట్ చెల్లించపోవడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 14న కోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీ నిన్న సేకరించింది. ఇందులో షెరావత్, ఆమె భర్త ఇంటి ఓనర్ కు రెంట్ రూపంలో 78,787 యూరోలను చెల్లించడమే కాక ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించినట్టు ఉంది.

2017 జనవరి 1వ తేదీ నుంచి వీరిద్దరూ ప్యారిస్ లోని ఓ అపార్ట్ మెంట్ ను రెంట్ కు తీసుకున్నారు. నెలకు 6,054 యూరోల రెంట్ వీరు చెల్లించాల్సి ఉంది. అయితే వీరు కేవలం 2,715 యూరోలను మాత్రమే సింగిల్ టైమ్ లో చెల్లించారని, ఆ తర్వాత రెంట్ కట్టడం మానేశారంటూ అపార్ట్ మెంట్ ఓనర్ కోర్టుకెక్కాడు. నవంబర్ 14న కోర్టు విచారణ సమయంలో మల్లికా షెరావత్ తరపు లాయర్ వాదిస్తూ, ప్రస్తుతం వీరు ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో, ఓనర్ తరపు లాయర్ వాదిస్తూ వీరు రెంట్ కట్టలేకపోయినా, భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారని అన్నారు. అనంతరం, డిసెంబర్ 14న కోర్టు తుది తీర్పును వెలువరించింది.

సిరిల్లీ ఆక్సెన్ ఫాన్స్ అనే ఫ్రెంచ్ వ్యక్తిని పెళ్లాడిన మల్లిక ఆ తర్వాత ఫ్రాన్స్ లోనే కాపురం పెట్టింది. మరోవైపు, ఈ వార్తలపై మల్లిక స్పందించింది. ప్యారిస్ లో తనకు సొంత అపార్ట్ మెంట్ కానీ, రెంటెడ్ అపార్ట్ మెంట్ కానీ లేదని ట్వీట్ చేసింది. అలాంటప్పుడు తాను అపార్ట్ మెంట్ ను ఖాళీ చేసే ప్రశ్నే తలెత్తదని చెప్పింది. తనకు ప్యారిస్ లో అపార్ట్ మెంట్ ఉందని మీడియాలోని కొందరు భావిస్తున్నారని... అది నిజం కాదని తెలిపింది. ఎవరైనా తనకు అపార్ట్ మెంట్ ను డొనేట్ చేసి ఉన్నట్టైతే వారి అడ్రస్ ను పంపాలని సెటైర్ వేసింది.
mallika sherawat
bollywood

More Telugu News